శ్రీకృష్ణాష్టమి రోజు చాలారోజుల తర్వాత జెమినీ టీవీలో ఒక సినిమా చూసాను.
అది ముగ్గురు కృష్ణుల సృష్టి: ఎవరా కృష్ణులంటారా? చెపుతున్నా! జాగ్రత్తగా వినండి....
ఈ సినిమాలో ముఖ్యమైన ఘట్టాలు - లాక్షాగృహ దహనం (మత్తు వదలారా నిద్దుర) , హిడింబాసురవధ (ఛాంగురే బంగారు రాజా), బకాసుర వధ (భళాభళీ నా బండీ), శ్యమంతకోపాఖ్యనం (వినాయకచవితిలో చదివే కథ) జరాసంధ వధ, రాజసూయం,

- ఒకటో కృష్ణుడు - క్రిష్ణద్వైపాయనుడు, అంటే వేదవ్యాసుడనమాట!
- రెండో కృష్ణుడు - కృష్ణదేవరాయలు, అదే ఆముక్తమాల్యద రాసినోడు!
- మూడో కృష్ణుడు - ఇంకెవరు? మనవాడే, నటరత్నం ఎన్టీవోడు! వాడే దర్శకుడు కూడా.
ఈ సినిమాలో ముఖ్యమైన ఘట్టాలు - లాక్షాగృహ దహనం (మత్తు వదలారా నిద్దుర) , హిడింబాసురవధ (ఛాంగురే బంగారు రాజా), బకాసుర వధ (భళాభళీ నా బండీ), శ్యమంతకోపాఖ్యనం (వినాయకచవితిలో చదివే కథ) జరాసంధ వధ, రాజసూయం,
And more importantly మయసభ లో ధుర్యోధనుడి (ఎంటీవోడి) ఏకపాత్రాభినయం’ with that all time famous song which blared on the loud speakers of every village cinema tent (డేరాహాల్లు) for decades, announcing the evening show...
అదే...
స్వాగతం కురు సార్వభౌమా స్వాగతం... టడడం టడడం
సినిమాకి మూలకథ - మహాభారతంలో ఆదిపర్వం,
వేదవ్యాస విరచితం అయినా ....
సారమతిం గవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లో
నారసి మేలునాన్ ఇతరు లక్షర రమ్యత నాదరింప నా
నా రుచిరార్థ సూక్తినిధి నన్నయ భట్టు తెనుగున మహా
భారత సంహితా రచన బంధురుడైయ్యె జగద్ధితంబుగన్

మనకి తెలిసింది ఆ భారతమే కదా?
దానికి తోడు నన్నయకి రెండొందల ఏళ్ళ తరువాత ఇంకో భాగవతోత్తముడు పుట్టుకొచ్చాడు. ఎక్కడో తెలంగాణంలోని ఏకశిలా నగరంలోనట. ఒకవేళ సమగ్ర ఆంధ్రదేశం ఇంకొక తూరి విడిపోవాల్సొస్తే, ఆయన తెలంగాణంలో కాదు, రాయలసీమలోని ఒంటిమిట్టలో పుట్టాడని వాదిద్దాం, సరేనా? ఆయన పేరు, బమ్మెర పోతన. టాంక్ బండ్ పైన ఆయన విగ్రహం కూడా పడగొట్టారట మన సోదరులు. అందుకే అయన్ని సీమకి తరలించడం తప్పేంలేదేమో?
ఆయన లలిత స్కంధము లోని తొమ్మిదో స్కంధంలో ఒక ఎపిసొడ్ ని మన అన్నగారు తనది కాని exceptional శైలిలో ఒక ballet గా మలిచారు. చిత్రపు నారాయణుడి భక్తప్రహ్లాద సినిమా, బాపూ గారి సీతాక’ళ్యా’ణం మాత్రమే, తెలుగు సినిమాల్లో దానికి సరితూగ గలవేమో?
అది... 45 minutes of ethereal bliss! తెలుగులో అలౌకికానందం.
అందులో ఒక కృష్ణుడు ఎప్పుడో వేల సంవత్సరాల గింత ద్వారకలో ఉండిండట. మన ఎంటీవోడిలాయే ఉండే. కాదని ఎవడైనా చెప్తుంటే... వంగదీసి గుద్దుడే, ఏం ఆలోచించే పన్లే. సమఝాయిందే? రెండో వాడు సరే మనోడే. ఇక మూడో కృష్ణుడు, మూరురాయగండడు. ఈ రాయల వారు ఏడనుండప్పా వస్తాండు? అనుకుంటుండ్రా? అర్థమవ్వాలంటే ఈ సినిమాలో రుక్మిణిని చూడాలి. ఓమ్మో ఏముంద్రా ఆ పిల్ల! బొత్తిగా పదారేళ్ళు కూడా లేని అరవ పిల్ల. కే ఆర్ విజయ అంట. ఆ పిల్లని చూసుంటే అరవ పిల్లల మీద చిన్నచూపు వదిలిపెట్టి శ్రీనాథుడు మద్రాసులో మకాంపెట్టే వాడేమో?
మరి ఈ పిల్లకీ, రాయలకీ ఏం సంబంధం అనుకోకండి. ఉంది. రాయలు రాసిన ఆముక్తమాల్యద అసలు పేరు గోదాదేవి. అరవోళ్ళు ఆండాళ్ అంటారు. సిరివిల్లిపుత్తూరులో పూజారి కూతురు. ఆ ప్రబంధంలో హీరోయిన్. ఆమే మన అన్నగారికి inspiration. పాడించింది భాగవతంలో పద్యాలైనా, ప్రతి frameలో రంగనాథుని పొందుకై తపించే కృష్ణరాయని గోదాదేవే సాక్షాత్కరిస్తుంది.

చూడాల్సిందే కానీ, ఆ experience చెప్పనలవి కాదు.
నాకైతే అది ఒక పూర్తి అచ్చతెలుగు సినిమా.
నాకైతే అది ఒక పూర్తి అచ్చతెలుగు సినిమా.
తెలుగు వాళ్ళెవరైనా సరే, దేశంలో కానీ పరదేశంలో కానీ ఎక్కడున్నా సరే, అందరూ కలిసి ఒకేసారి కనుక చూస్తే ఇక ఈ తెలంగాణా లాంటి విభజన వాదాలు పుట్టవ్. Avataar సినిమాలో Spirit Tree లాగా అందరినీ కలపగల్దేమో?
ఇప్పటికే, వెల్లూరూ, ధర్మపురి, కోలారు, బళ్ళారీ, గంజామూ ఇలా ఎన్నో పోనేపోయాయి. ఇంకా ముక్కలు చేసి మనకొక ఉనికి లేకుండా చేసుకోవాలా?